Search DHIH library

అయ్యప్ప స్వామి భజన · Ayyappa bhajan · పూర్తి పాట · Complete song

Devudochinaduro

దేవుడొచ్చినాడురో

స్వామియే శరణం అయ్యప్ప · Lord Ayyappa, you are our refuge

దీపాలతో భక్తులను అనుగ్రహిస్తున్న అయ్యప్ప స్వామి
చదవడానికి ఎంపికలు · Reading options
అక్షరాల పరిమాణం · Text size

సాధారణం · Standard

దేవుడొచ్చినాడురో సూడరో సూడరా (2) అయ్యప్ప స్వామిరో వచ్చెరో వచ్చెరా (2) ఓ దేవా మా దేవా మా కోసమే వచ్చినావ.. స్వామి.. ఓ దేవా.. స్వామి.. మా దేవా.. స్వామి.. మా కోసమే వచ్చినావ

ముక్కోటి దేవుళ్ళను ముందుగానే కొలిచినాము (2) నువ్వు ఒక్కడివే దేవుడని ఇప్పుడు తెలుసుకున్నాము (2) మనసంతా ఇప్పేసి ఎదలన్ని చెప్పేద్దాం.. స్వామి.. మనసంతా ఇప్పేసి ఎదలన్ని చెప్పేద్దాం హరిహరా తనయుడా అందరి దేవుడా ఆపదలో ఆదుకొనే శబరిమలై నాధుడా — దేవుడొచ్చి

రంగు రంగు పూలు తెచ్చి హారలే వేసినాము (2) పుట్టతేనె పాలతొటి ఫలహారము చేసినాము (2) పాదాలే కడిగేము నీ పూజలే చేసేము (2) గణపతి సోదరుడా జ్యోతీస్వరూపుడ కార్తికేయ సోదరుడా కాంతిమలై వాసుడా — దేవుడొచ్చి

పగలంతా పనిచేసి అలసిసొలసి పోయినాము (2) సందెవేళ కాగానే ఆలయంబు చేరినాము (2) ఆడేము పాడేము ఆనందమే పొందేము ఆడేము.. స్వామి.. పాడేము.. స్వామి.. ఆనందమే పొందేము ఎరిమేలి వాసుడా వావరకు మిత్రుడా కరిమలై వాసుడా పంబానది బాలుడా

దేవుడొచ్చినాడురో సూడరో సూడరా అయ్యప్ప స్వామిరో వచ్చెరో వచ్చెరా ఓ దేవా మా దేవా మా కోసమే వచ్చినావ ఓ దేవా.. స్వామి.. మా దేవా.. స్వామి.. మా కోసమే వచ్చినావ మా కోసమే వచ్చినావ మా కోసమే వచ్చినావ మా కోసమే వచ్చినావ

← అన్ని అయ్యప్ప భజనలు · All Ayyappa songs