Search DHIH library

అయ్యప్ప స్వామి భజన · Ayyappa bhajan · పూర్తి పాట · Complete song

Gana Gana Gantalu Ganamuga

గణ గణ గంటలు ఘనముగా

స్వామియే శరణం అయ్యప్ప · Lord Ayyappa, you are our refuge

ఆలయ గంటల మధ్య ఆసీనుడైన అయ్యప్ప స్వామి
చదవడానికి ఎంపికలు · Reading options
అక్షరాల పరిమాణం · Text size

సాధారణం · Standard

గణ గణ గంటలు ఘనముగా మ్రోగంగ గణ గణ గంటలు ఘనముగా మ్రోగంగ అయ్యప్ప నీ అభిషేకము జరుగంగా కోటొక్క భక్తులు పాటలు వాడంగ అబ్బబ్బ శబరిమల ధగ ధగ మెరిసే ఆ కోవెల మణికంట నీ క్షేత్రము జూడ ముచ్చటగా మణికంట నీ రూపము కన్నుల విందంటా

అల శబరీ శిఖరానా అంతెత్తు కొండల పైన స్వర్ణ మందిర నిలయం అయ్యప్పా నీ దివ్య రూపం చూసిన భాగ్యమటా నిన్ను కొలిచిన పుణ్య మటా అయ్యప్పా అభిషేక ప్రియ మా అయ్యప్పా అయ్యప్పా అలంకార ప్రియ అయ్యప్పా

అద్భుత మహిమల వాడా మా ఆపద్భందువు నీవే మహిషిని కూల్చిన వాడా మా మంచి మార్పువు నీవే నీదు భక్తిలోనా మాకు ముక్తి కలిగేనయా మణికంట మా భారము అంతా నీదంతా మణికంట నువ్వు లేని నేను లేనంటా

కుల మత భేదాలు లేక నీ మాలను వేసినమయ్య సత్యము ధర్మమూ మాలో అణువణువున నిలిపిన మయ్యా గుండె నిండా భక్తీ నింపి నీ గుడికొచ్చినము శత కోటి భక్తులు నీ శబరి చూడంగా ఆనందం పరమానందం అయ్యే నయ్యా

← అన్ని అయ్యప్ప భజనలు · All Ayyappa songs