అయ్యప్ప స్వామి భజన · పూర్తి పాట

Kanne Swamy O Kanne Swamy

కన్నెస్వామి ఓ కన్నెస్వామి

స్వామియే శరణం అయ్యప్ప

ఇరుముడితో అయ్యప్ప దర్శనానికి వెళుతున్న కన్నెస్వామి
చదవడానికి ఎంపికలు
అక్షరాల పరిమాణం

సాధారణం

కన్నెస్వామి ఓ కన్నెస్వామి కన్నెస్వామి ఓ కన్నెస్వామి వేయికనులు చాలవులే – మన అయ్యప్పనూచూడ ఇరుముడిని కట్టుకొని – మనం ఎరిమేలి పోదాము వేషాలే వేద్దామా – పేటతల్లై ఆడుదాము కొబ్బరికాయ ఒకటికొట్టి – ఓవరుని మ్రొక్కుదాము ||కన్నెస్వామి||

ఆలుదాకు చేరుకుని – స్నానాలే చేద్దాము పంబాకు చేరుకుని – స్నానాలు చేద్దాము కొబ్బరికాయ ఒకటి కొట్టి – గణపతిని మ్రొక్కుదాము శరంగుత్తి చేరుకుని – శరణాలు గ్రుచ్చుదాము ||కన్నెస్వామి||

కొబ్బరికాయ ఒకటికొట్టి – పద్దెనిమిది మెట్లెక్కి పరవశం పొందుదాము – నెయ్యాభిషేకమును ఘనముగా చేద్దాము – సంక్రాంతి రోజున – జ్యోతినే చూద్దాము హారతినే ఇద్దాము – శరణమంటు వేడుదాము ||కన్నెస్వామి||

← అన్ని అయ్యప్ప భజనలు