నిన్ను చూడక నేనుండగలనా నీ కొండకు రాకుండ గలనా ఈ దేహం నీవు ప్రసాదం నా ప్రాణం నీ ఉపకారం నా ప్రాణం నీ ఉపకారం ॥ 2 ॥
మనసున్నది నీ ధ్యాన లోనే తనువున్నది నీ సేవ లోనే ॥ 2 ॥ ప్రతి నోట నీ చరణ నామం నా నోటే నీ మధుర గానం నా నోటే నీ మధుర గానం ॥ నిన్ను చూడక… 2 ॥
ఆ బ్రహ్మకు నీ రూపమడనా రాత రాశాడు నిను చూడగా ॥ 2 ॥ కనిపించే దైవాలు తల్లిదండ్రులే జన్మనిచ్చారు ఏనాటి ఫలమో జన్మనిచ్చారు ఏనాటి ఫలమో ॥ నిన్ను చూడక… 2 ॥
ఈ ఇహమందు ఏ కొత్త కోరికలు ఇక రాకుండా నువ్వు చూడవా ॥ 2 ॥ ఈ జన్మంతా నిన్ను కొలిచి సేవింతునయ్యా ఇక మరుజన్మ నాకివ్వకయ్యా ఇక మరుజన్మ నాకివ్వకయ్యా ॥ నిన్ను చూడక… 2 ॥