అయ్యప్ప స్వామి భజన · పూర్తి పాట

Pacha Pachani Chettura

పచ్చ పచ్చాని చెట్టురా

స్వామియే శరణం అయ్యప్ప

పచ్చని వనంలో ఆసీనుడైన అయ్యప్ప స్వామి
చదవడానికి ఎంపికలు
అక్షరాల పరిమాణం

సాధారణం

పచ్చపచ్చని చెట్టురా చెట్టు మీద రామచిలుకరా ||2|| రామచిలక నోట ఎల్లవేలలా స్వామి నామమే పలుకురా నీ స్వామి నామమే పలుకురా ||పచ్చపచ్చ!!

ఒకానొక రోజున చిలక నిసెంత కొచ్చెరా స్వామి స్వామి అంటూ నన్ను పేరు పెట్టి పిలువ సాగెరా ఎటమ్మ చిలకమ్మ ఏటని అడిగితే...... ||2|| ఆకుల్లో తల పెట్టి ఎక్కెక్కి ఏడ్చింది |పచ్చపచ్చ!!

చింతలేక చెట్టు పైన చిలకగోరింకలైన ఊసులాడుకుంటూ ఈఊరేమరిచి పాయినవి అట్టి ఆ జంటను బోయవాడు చూసెను చిలకమ్మను చూసి విలుఎక్కుపెట్టెను అది జూసి గోరింక చిలుక కడ్డువచ్చెరా గోరింక కంటికి గాయమైనదిరా గోరింక కంటిచూపు చిలకకు కరువాయెరా ||పచ్చపచ్చ||

గాయమైన గోరింకకు అన్ని తానైనది తనకంటితోనే లోకాన్ని చూపుతున్నది రామచిలుక ఒకనాడు స్వామి పూజచూసెను పూజలోన గురుస్వామి మహమలెన్నో చెప్పెను నడవలేనివారు కొండనడిచి వెళ్లారని మాటరాని వారు పాట పాడుతున్నారని చూడలేని వారు జ్యోతి చూచుచున్నారని ||పచ్చపచ్చ

అట్టియా రామ చిలక స్వామి మాల వేయమని నన్ను వేడుకున్నది బ్రతిమిలాడుతున్నది మండల వ్రతమును యరుక చేతునని తన ఇరుముడిని నా తల పైన ఉంచమని ఇరుముడిలోన తనుగోరింక వచ్చునని మహిమల మణికంఠుని కనులారగాంతునని ఆ జ్యోతి దర్శనం గోరింకకు చూపమని ||పచ్చపచ్చ

← అన్ని అయ్యప్ప భజనలు