అయ్యప్ప స్వామి భజన · పూర్తి పాట

Pallikattu Shabarimalaiki

పల్లికట్టు శబరిమలైకి

స్వామియే శరణం అయ్యప్ప

శబరిమల యాత్రకు పల్లికట్టు మోసుకెళుతున్న భక్తులు
చదవడానికి ఎంపికలు
అక్షరాల పరిమాణం

సాధారణం

ఇరుముడితోటి నిను మదినింపి – కదిలేము స్వామి అండగనుండి నీడగనిలిచి – దీక్షను కావవయ్యా పల్లికట్టు శబరిమలైకి – కల్లుమ్ ముల్లుం కాలికి మెత్తెయి స్వామియే అయ్యప్పో – అయ్యప్పో స్వామియే || 2 ||

పల్లికట్టు శబరిమలైకి – కల్లుమ్ ముల్లుం కాలికి మెత్తెయి స్వామియే అయ్యప్పో – అయ్యప్పో స్వామియే నెయ్యాభిషేకం చెయ్యండి – హారతులిచ్చి కొలవండి ఇరుముడి స్వామికి భక్తిగ ఇచ్చి – వేదన తీరగ వేడండి అయ్యప్పను కని పిలవండి స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే || 2 ||

వేకువ జామున నిద్రనులేచి – శీతల స్నానము శ్రద్దగా చేసి మాలను దాల్చి శీఘ్రముగా – దీక్షారంబము చేసితిని గణపతి షణ్ముక అయ్యప్ప స్వాముల – ప్రాతఃకాలపు వేళల తలచి స్వామి అయ్యప్ప శరణు ఘోషతో – మండల దీక్షచేసితిని స్వామియే అయ్యప్పో, అయ్యప్పో స్వామియే || 2 ||

ముప్పూటలు శ్రీ అయ్యప్ప స్వామిని – ముదమున కొలిచి సేవించి నల్లని దుస్తులు ధరించి – శ్రీ శని భగవానుని కొలిచెదము కాలికి చెప్పులు లేకయే తిరుగుచు – అయ్యప్పలనే శృతియించితి సంధ్యా సేవలు చేయుచు స్వామిని – ఆనందముగా కొలిచెదను స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే || 2 ||

భజనలు చేసే స్వాములగృహములు – వెతికే వెళ్ళితిమి పడి పూజలతో మణిధరుని – జ్యోతిగ చూచి మురిసితిని

స్వామి ప్రసాదము సేవించి – నేలను నిద్దుర పోయితిని మండలమంతా ఇటులే – అయ్యప్పను నే కొలిచితిని దేహబలందా – పాద బలందా స్వామి ఇచ్చిన ధైర్యముతోటి – దీక్షను ముగియించి గురు స్వామిని గని – భక్తితో కొలచి ఇరుముడి దాల్చితిని – నే ఇరుముడి దాల్చితిని స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే || 2 ||

సత్య వాక్కులను పలుకుచూనే – స్వామి నామము తలచితినీ దృష్టింతలను మదిలో మాని – అయ్యప్పను యద దాల్చితిని మానస మందున మురిసితిని పదినెనిమిది మెట్లెక్క తలచితిని అయ్యప్ప స్వామినే కాంచేదనూ – మకర జ్యోతిని చూసెదను స్వామి సన్నిధిలో – నన్ను నే మరచెదను పల్లికట్టు శబరిమలైకి కల్లుమ్ ముల్లుమ్ కాలికిమెతై స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే || 2 ||

శరణం శరణం అయ్యప్ప – స్వామి శరణం అయ్యప్ప || 6 ||

← అన్ని అయ్యప్ప భజనలు